సన్ రైజర్స్ పేరు చెబితే చాలు అగ్రెసివ్ నెస్ కూ...బ్రూటల్ అటాకింగ్ కు పెట్టింది పేరు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో తొలి మూడు స్థానాలు సన్ రైజర్సే ఉండటం ప్రత్యర్థులపై ఆ టీమ్ చూపించే డామినెన్స్ కి ఉదాహరణ. అలాంటి ఆరెంజ్ ఆర్మీ ఐపీఎల్ 2025 సీజన్ ను కూడా చాలా స్ట్రాంగ్ గా ప్రారంభించింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మీద పూనకాలు వచ్చినట్లు ఆడింది ప్యాట్ కమిన్స్ సేన. ఏకంగా 286 పరుగులు చేసి రెండో హయ్యెస్ట్ టీమ్ స్కోర్ బాదింది సన్ రైజర్స్. ఇంకేముంది ఈ సీజన్ లో కచ్చితంగా 300 పరుగులు చేసి తీరుతుంది అందరూ భావించారు. పైగా జట్టులో అభిషేక్ శర్మ, హెడ్, క్లాసెన్, నితీశ్ రెడ్డిలాంటి వాళ్లకు తోడుగా ఇషాన్ కిషన్ కూడా కలవటంతో ఫ్యాన్స్ అయితే 300 కోసం బలంగా ఫిక్స్ అయిపోయారు. పైగా ఇదే ఇషాన్ కిషన్ రాజస్థాన్ మీద సూపర్ సెంచరీ కొట్టి అసలే బలమైన టీమ్ కు మరింత బలాన్ని చేర్చాడు. తమ జట్టును తమకే ఆత్మవిశ్వాసం ఎక్కువై పోయిందో..లేదా అది అతివిశ్వాసంగా మారిపోయిందో తెలియదు కానీ మొదటి మ్యాచ్ గెలిచిన తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయింది సన్ రైజర్స్. ఉప్పల్ లో లక్నో చేతిలో ఓటమి, వైజాగ్ వెళ్లి ఢిల్లీ చేతిలో ఓటమి, నిన్న ఈడెన్ వెళ్లి కేకేఆర్ చేతిలో ఓటమి ఇలా హ్యాట్రిక్ ఓటముల రికార్డు కొట్టింది సన్ రైజర్స్. ప్రస్తుతానికి పాయింట్స్ టేబుల్ లో ఆఖరి స్థానంలో కంఫ్టరబుల్ గా ఉంది ఆరెంజ్ ఆర్మీ. ఏ బ్యాటింగ్ అయితే బలం అని భావిస్తామో అదే బ్యాటింగ్ లో ఉన్నట్లుండి వీక్ గా మారిపోయింది సన్ రైజర్స్. మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి భారీగా ట్రోల్స్ వస్తున్నాయి కానీ సన్ రైజర్స్ మర్చిపోవాల్సింది ఒకటే అదే 300 కొట్టేయాలని ఫ్యాన్స్ మెప్పించేయాలనే ప్రెజర్. క్రికెట్ అనేది బేసిక్స్ కట్టుబడి ఆడాల్సిన ఆట. మనకుండే బ్రూటాలిటీ అగ్రెసివ్ నెస్ అన్ని సార్లు పనిచేయకపోవచ్చు...ప్రస్తుతానికి తగినట్లుగా ఆటను మార్చుకుని ఆడకపోతే 300 రికార్డు సంగతి దేవుడెరుగు...ఈ సీజన్ ను అత్యంత చెత్తగా ముగించే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఫీలైపోతున్నారు.